Friday, March 13, 2026
Homeకెరీర్TG POLYCET: టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. మే 13న టీజీ పాలిసెట్ పరీక్ష!

TG POLYCET: టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. మే 13న టీజీ పాలిసెట్ పరీక్ష!

TG POLYCET: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ (TG POLYCET- 2026) పరీక్షకు ముహూర్తం ఖరారైంది. మే 13వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానుంది.

- Advertisement -

అర్హత మరియు రిజర్వేషన్లు: పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది లక్ష మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో కనీసం నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా (Local) పరిగణిస్తారు. నాన్-లోకల్ కోటా కింద పదేళ్లు రాష్ట్రంలో నివసించిన వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఉంటుంది.

పరీక్షా విధానం: మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ (60 మార్కులు), ఫిజిక్స్ (30 మార్కులు), కెమిస్ట్రీ (30 మార్కులు) నుండి ప్రశ్నలు అడుగుతారు. 10వ తరగతి సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో నెగిటివ్ మార్కులు ఉండవు.

Also read-MBA admissions: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలు.. నేటితే ముగియనున్న దరఖాస్తు గడువు!

ప్రవేశ ప్రక్రియ: పరీక్ష అనంతరం తొలుత ప్రాథమిక కీని, ఆ తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి, రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ వారం విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా వివరాలను తనిఖీ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News