Homeకెరీర్TET: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు ఈరోజే చివరి గడువు!

TET: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు ఈరోజే చివరి గడువు!

AP TET: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. టెట్-2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి గడువు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబరులో మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో టెట్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

ఏపీ టెట్-2026 పూర్తి షెడ్యూల్:

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఈరోజే చివరి గడువు (జూలై-5)
  • హాల్ టికెట్ల జారీ: జులై 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
  • టెట్ పరీక్షల నిర్వహణ: ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయి.
  • పరీక్షా విధానం: ప్రతిరోజు రెండు సెషన్ల (ఉదయం, మధ్యాహ్నం) చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఫలితాల విడుదల: సెప్టెంబర్ 15వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.

అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ మాసంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే టెట్ పరీక్షల తతంగాన్ని వీలైనంత త్వరగా ముగించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News