Saturday, November 15, 2025
Homeకెరీర్AP CET Counseling 2025: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎడ్‌సెట్, లాసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌...

AP CET Counseling 2025: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎడ్‌సెట్, లాసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

AP CET Counseling Schedule 2025: ఏపీలో ఎడ్‌సెట్, పీఈసెట్‌, లాసెట్, పీజీ లాసెట్ 2025లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాలు.. ప్రారంభం కానున్నట్లుగా విద్యామండలి అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ కౌన్సెలింగ్‌ ఇంతవరకు ప్రారంభంకాలేదు. అయితే తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు విద్యార్థులకు అధికారులు వెల్లడించారు . తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి పేర్కొన్నారు.

ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం సెప్టెంబర్‌ 8 నుంచి 11వ తేదీ వరకు తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్‌ 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనున్నట్లుగా పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 12 నుంచి 14 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్‌లను మార్పు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 15న అవకాశం ఇచ్చినట్లుగా విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 17న ఉండనున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్‌ 19 నుంచి కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించామని అన్నారు.

Also Read: https://teluguprabha.net/career-news/ib-job-notification-2025-security-assistant/

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: బీఈడీలో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్‌ 9 నుంచి12 వరకు తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్‌ 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనున్నట్లుగా పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 13 నుంచి15 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్‌లను మార్పు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 16న అవకాశం ఇచ్చినట్లుగా తెలిపారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 19, 20 తేదీల్లో ఉండనున్నట్లుగా తెలిపారు.

ఏపీ పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: పీఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్‌ 10 నుంచి13 వరకు తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 నుంచి 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనున్నట్లుగా పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 14 నుంచి16 వరకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్‌లను మార్పు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 17న అవకాశం ఇచ్చినట్లుగా తెలిపారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 19 న ఉండనున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 22, 23 నుంచి కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad