AP EAPCET: ఏపీలో ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీసెట్ (AP EAPCET-2026) దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము (Late Fee) లేకుండా మార్చి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ ఏడాది సైతం పరీక్షల బాధ్యతను జేఎన్‌టీయూ-కాకినాడకు అప్పగించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు: నిర్ణీత గడువు (మార్చి 17) లోపు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా అపరాధ రుసుము(ఫైన్)తో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మార్చి 21 వరకు రూ. 1,000, మార్చి 25 వరకు రూ. 2,000, మార్చి 30 వరకు రూ. 4,000, ఏప్రిల్ 03 వరకు రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లుగా అధికారులు తెలిపారు.
సవరణలకు అవకాశం: దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి (Edit Option) ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈ మూడు రోజుల్లో తమ వివరాలను ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చు.
Also read-Jobs: నెలకు రూ.2,80,000ల జీతంతో.. 732 ఉద్యోగాలు.. ఏ కంపెనీనో తెలుసా!
పరీక్షల తేదీల్లో మార్పు లేదు: దరఖాస్తు గడువు పెంచినప్పటికీ ముందుగా ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు. నిర్ణయించిన తేదీల్లోనే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

