ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET-2025 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/నుంచి లేదా మనమిత్ర వాట్సప్ (9552300009) నెంబర్‌తో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
కాగా ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 21 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి. ఫార్మసీ కోర్సుల పరీక్షలు మే 19, 20 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు.