విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు(AP EAPCET Results) విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ఆచార్య CSRK ప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో కాకినాడ జేఎన్‌టీయూ(JNTUK) నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు నిర్వహించిన 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు.


