Thursday, May 15, 2025
Homeకెరీర్AP ECET-2025: ఏపీఈసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల సత్తా

AP ECET-2025: ఏపీఈసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల సత్తా

ఏపీ ఈసెట్‌(AP ECET-2025) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకే రావడం విశేషం. సిద్దిపేట జిల్లాకు చెందిన కట్లె రేవతి 169 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మొత్తం 35,187 మంది పరీక్షలు రాస్తే 31,922 మంది పాస్ అయ్యారు. ఈనెల 6వ తేదీన ఈ ప్రవేశపరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(APSCHE) విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx వెబ్‌సైట్‌ సందర్శించండి. రిజిస్ట్రేషన్‌ నెంబర్, హాల్‌టికెట్‌ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి రిజల్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

APECET 2025 ప్రవేశ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరానికి గాను బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. త్వరలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News