AP EdCET Results: ఏపీలో బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్ (AP- EdCET)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షలో అభ్యర్థులు రికార్డు స్థాయి ప్రతిభ కనబరిచారు. మొత్తం రాసిన వారిలో ఏకంగా 99.3 శాతం మంది అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్: పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఉన్నత ర్యాంకులు కైవసం చేసుకున్న అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు తమ ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. త్వరలోనే బీఈడీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించనుందని పేర్కొన్నారు.
Also read-SSC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12,256 పోస్టులతో నోటిఫికేషన్!

