AP Inter Results 2026 on April 15th: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-letter-to-pm-narendra-modi-on-delimitation/
విద్యార్థులు ఫలితాల కోసం BIEAP Official Website సందర్శించవచ్చు. మరింత సులభంగా ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 కు “Hi” అని సందేశం పంపి ఫలితాలను పొందవచ్చని మంత్రి తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగాయి.

