Homeకెరీర్LAWCET: ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

LAWCET: ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

AP LAWCET: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను ఎక్స్‌ వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఈ ఏడాది మే 4న జరిగిన లాసెట్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 19,197 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మంత్రి పేర్కొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -

స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా: ఈ ఏడాది లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. మొత్తం రాసిన వారిలో 80% మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్‌, మరియు పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also read-Army jobs: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. లక్షన్నరకు పైగా జీతం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News