AP Mega Dsc Certification Verification and Merit List : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ కీ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచారు. అంటే విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఫైనల్ కీ విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.
మెరిట్ జాబితాలను ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధ్రువపత్రాల పరిశీలన) ఉంటుంది. ఈ ప్రకారం.. ఆగస్ట్ 16వ తేదీ నుంచి దీనికి ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… పోస్టింగ్స్ ను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేస్తారు. మొత్తంగా ఈనెలఖారు నాటికి ఏపీలో కొత్త టీచర్ల నియామక ప్రక్రియంతా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కుదరకపోతే సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే (ఉపాధ్యాయుల దినోత్సవం) సందర్భంగా పోస్టింగ్ ఆర్డర్ కాపీలను పంపిణీ చేస్తారని సమాచారం అందింది.
Also Read: https://teluguprabha.net/career-news/neet-pg-2025-admit-cards-and-exam-dates-are-announced/
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు ఈ మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా ముగించారు. మొత్తంగా ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు. కాగా, పలువురు అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/career-news/upsc-released-job-notification-in-epfo-here-are-the-complete-details-about-it/
డీఎస్సీ పైనల్ కీ – డౌన్లోడ్ చేసుకోండిలా…
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: ముందుగా, అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ని ఓపెన్ చేయండి.
ఫైనల్ కీ ఆప్షన్ ఎంచుకోండి: హోం పేజీలో కనిపించే ‘Final Key’ లింక్‌పై క్లిక్ చేయండి.
సబ్జెక్ట్ ఎంపిక: ఇక్కడ సబ్జెక్టుల వారీగా జాబితా కనిపిస్తుంది. మీరు పరీక్ష రాసిన సబ్జెక్ట్ పక్కన ఉన్న ‘డాక్యుమెంట్’ లింక్‌పై క్లిక్ చేయండి.
పీడీఎఫ్ డౌన్‌లోడ్: లింక్‌పై క్లిక్ చేయగానే, ఫైనల్ కీతో కూడిన పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మార్కుల అంచనా: ఈ ఫైనల్ కీ ఆధారంగా అభ్యర్థులు తమ పరీక్ష మార్కులను అంచనా వేసుకోవచ్చు.


