కాకతీయ యూనివర్సిటీ(తెలుగు ప్రభ): కాకతీయ విశ్వవిద్యాలయం సైన్స్ ఫ్యాకల్టీలో 2026–27 జూలై సెషన్‌కు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ ప్రొ.బి.వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, ఫిజిక్స్, జువాలజీ విభాగాల్లో మొత్తం 64 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
యూజీసీ-నెట్,సీఎస్ఐఆర్-నెట్, గేట్ తదితర జాతీయ స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ వివరాలు నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అక్టోబర్ 24,2026లోగా దరఖాస్తులను సైన్స్ ఫ్యాకల్టీ డీన్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.పూర్తి వివరాలకు www.kakatiya.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

