Apprentice Jobs in Indian Railway: రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయబోతోంది. అర్హత, ఆసక్తి గల వారు జూన్ 30లోపు www.rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా జూలై 29 లోపు అప్లై చేసుకోవచ్చు. అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, పరీక్ష విధానం, ఫీజు, రిజర్వేషన్ వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో పొందుపరుస్తారు. ఈ నోటిఫికేషన్ జూన్ 29న విడుదల కానుంది. ఈ మొత్తం 6565 ఉద్యోగాల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 323, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు 6242 ఉన్నాయి. ముంబై, చెన్నై, న్యూఢిల్లీ లాంటి పెద్ద పెద్ద రైల్వే జోన్లలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి.
Also read: Liquor price: ఇకపై కిక్కుకు ఖర్చెక్కువ.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఏ బ్రాండుపై ఎంతంటే?
కేవలం పదో తరగతి అర్హతతో..
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే పదో తరగతి పాసై ఉండాలి. దాంతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అప్రెంటిస్‌షిప్ చేసిన వారు కూడా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకైతే డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. అప్లై చేసేవారికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగాలకు 33 ఏళ్ల వరకు, గ్రేడ్-3 ఉద్యోగాలకు 30 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం కేటగిరీల వారీగా వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం ముందుగా రైల్వే బోర్డు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ అప్లై లింక్‌పై క్లిక్ చేసి.. మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, చదువు వివరాలు అన్నీ తప్పులు లేకుండా నింపాలి. అడిగిన సర్టిఫికేట్లను కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.

