Thursday, January 22, 2026
Homeకెరీర్Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక!

Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక!

Railway Jobs: రైల్వే శాఖకు చెందిన అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే .. విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. అంతే కాకుండా కేవలం ఇంటర్‌ ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగాలను సాధించవచ్చు.

- Advertisement -

225 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ: ఇండియాన్‌ రైల్వేస్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి పంజాబ్‌లోని పాటియాల లోకోమోటివ్‌ వర్క్స్‌ విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 225 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అప్రెంటిస్ ఖాళీల వివరాలు:

  • ఎలక్ట్రీషియన్‌ యూనిట్‌లో అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 120
  • మెకానిక్‌(డీసిల్‌) యూనిట్‌లో ఖాళీల సంఖ్య: 25
  • మిషినిస్ట్‌ యూనిట్‌లో ఖాళీల సంఖ్య: 12
  • ఫిట్టర్‌ యూనిట్‌లో ఖాళీల సంఖ్య: 50
  • వెల్డర్‌(జీ&ఈ) యూనిట్‌లో ఖాళీల సంఖ్య: 18

Also Read:https://teluguprabha.net/career-news/80-job-vacancys-in-bdl-hyderabad/

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తితో పాటుగా ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉండనుందని నోటిఫికేషన్‌ రైల్వే సంస్థ పేర్కొంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.11,040 వరకు స్టైపెండ్‌ చెల్లించనున్నట్లుగా పేర్కొంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News