Singareni Jobs: నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సింగరేణి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్స్‌మెన్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడ్లలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం రిజర్వేషన్ పద్ధతిన అవకాశాన్ని కల్పించనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్/అర్బన్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అభ్యర్థులను మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు 33 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానంలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పొందిన విద్యార్హతలు, సీనియారిటీ ఆధారంగా మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ఏడాది కాలపరిమితికి అప్రెంటిన్‌షిప్ కేటాయించబడుతుంది. తుది ఎంపిక అనంతరం రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, టర్నర్, ఫిట్టర్, మిషనిస్టు, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్‌మెన్‌లకు నెలకు రూ. 8,050 స్టైఫండ్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన డీజిల్ మెకానిక్, వెల్డర్లకు స్టైఫండ్ కింద రూ. 7,700/- చొప్పున స్టైఫండ్ చెల్లించనున్నట్లుగా పేర్కొన్నారు.
Also Read:Jobs- రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక!
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 25, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ముందుగా ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత scclmines.com సింగరేణి వెబ్‌సైట్‌లో దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నింపిన దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, దానికి విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి సమీపంలోని ఏరియా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTC)లలో డిసెంబర్ 25, 2025వ తేదీలోగా సమర్పించాలి. తుది ఎంపికైన అభ్యర్థుల జాబితాను సింగరేణి వెబ్‌సైట్‌లో, ప్రధాన కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచుతారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

