వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ ఉద్యోగాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది.
ఖాళీలు: సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్
సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం(కొన్ని పోస్టులకు) తప్పనిసరి. వయసు 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు మధ్య ఉండాలి. పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300 జీతం ఉంటుంది.
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 600 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100 ఉంది. మార్చి 11, 2025 దరఖాస్తుకు చివరి తేదీ. పూర్తి వివరాల కోసం https://www.bankofbaroda.in/career వెబ్‌సైట్ సందర్శించండి