Monday, February 16, 2026
Homeకెరీర్Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఉద్యోగాలు.. ఎంపికైతే ప్రతినెలా లక్ష వేతనం.....

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఉద్యోగాలు.. ఎంపికైతే ప్రతినెలా లక్ష వేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Bank of Baroda Recruitment 2026: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన 418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా బ్యాంక్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి 418 ఖాళీలను భర్తీ చేయనుంది. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్1 (ఆఫీసర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 2(మేనేజర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 3(సీనియర్ మేనేజర్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ లేదా సంబంధిత రంగాల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ లేదా ఎంసీఏ డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఆఫీసర్ పోస్టులకు కనీసం ఏడాది పాటు సంబంధిత రంగంలో ఐటీ అనుభవం ఉండాలి. మేనేజర్ పోస్టులకు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రాథమిక వేతనం గ్రేడ్‌ను బట్టి మారుతుంది. జేఎంజీ స్కేల్ I నిబంధనల ప్రకారం, మేనేజర్లకు ఎంఎంజీ స్కేల్ 2 కింద, సీనియర్ మేనేజర్లు ఎంఎంజీ స్కేల్ 3 కింద వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ ఎగ్జామ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

ఎంపికైతే ప్రతినెలా లక్ష వేతనం..

ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో అర్థమెటిక్‌, ఇంగ్లీష్‌, ఆప్టిట్యూడ్, వృత్తిపరమైన పరిజ్ఞానంపై పరీక్షలు ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగానికి అత్యధిక వెయిటేజ్ ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టులను బట్టి లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేడు (జనవరి 30) ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News