Homeకెరీర్Bank Jobs: గుడ్‌ న్యూస్‌.. బ్యాంకింగ్ రంగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Bank Jobs: గుడ్‌ న్యూస్‌.. బ్యాంకింగ్ రంగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Bank of India: బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు మంచి అవకాశం లభించింది. ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్ కింద వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్న మొత్తం 779 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులకు జూన్ 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

- Advertisement -

ఖాళీల వివరాలు & విద్యార్హత: మొత్తం 779 పోస్టులను మూడు విభాగాలలో భర్తీ చేయనున్నారు. ఎంఎంజీఎస్-II కింద 677 పోస్టులు, ఎంఎంజీఎస్-III (MMGS-III) విభాగంలో 61 పోస్టులు అలాగే ఎస్‌ఎంజీఎస్-IV (SMGS-IV) కింద 41 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సీఏ (CA), సీఎంఏ-ఐసీడబ్ల్యూఏ (CMA-ICWA), సీఎస్ (CS), సీఎఫ్‌ఏ (CFA) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు: రూ. 850
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (PwD) అభ్యర్థులకు: రూ. 175

ఎంపిక విధానం & పరీక్షా సరళి: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. మొత్తం 125 మార్కులకు గానూ ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగనుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు, బ్యాంకింగ్ అంశాల నుండి 100 ప్రశ్నలకు గాను ఎగ్జామ్‌ జరుగనుంది. ఇక్కడ ముఖ్యవిషయం గమనించాల్సింది ఏంటంటే ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. మంచి జీతం, పటిష్టమైన భవిష్యత్తును అందించే ఈ కేంద్ర ప్రభుత్వ స్థాయి బ్యాంకింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News