Sunday, November 16, 2025
Homeకెరీర్Canada: విద్యార్థి వీసా దరఖాస్తులపై భారీ తిరస్కరణలు.. ఎఫెక్ట్‌ ఎక్కువగా ఇండియన్స్‌ కే!

Canada: విద్యార్థి వీసా దరఖాస్తులపై భారీ తిరస్కరణలు.. ఎఫెక్ట్‌ ఎక్కువగా ఇండియన్స్‌ కే!

Canada-Indian Students:విదేశాల్లో ఉన్నత చదువులకు కెనడా ప్రధాన గమ్యస్థానాల్లో ఒకటిగా చాలా కాలం నిలిచింది. దాని తరువాత స్థానంలో అమెరికా ఎక్కువ మంది విద్యార్థులు కెనడాను ఎంచుకుంటూ వచ్చారు. అయితే తాజా పరిస్థితులు ఆ ధోరణిలో పెద్ద మార్పు తెచ్చాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి జులై మధ్యలో వచ్చిన దరఖాస్తులలో దాదాపు 62శాతం తిరస్కరించినట్లు తెలుస్తుంది. గత దశాబ్దంలో ఇంత పెద్ద స్థాయిలో తిరస్కరణలు ఎప్పుడూ జరగలేదని నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -

రికార్డు స్థాయిలో వీసాలను…

కెనడాలో చదువుకోవాలని ఆశించే విద్యార్థుల దరఖాస్తులపై వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఇమ్మిగ్రేషన్‌ విభాగం (IRCC) ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలను తిరస్కరించింది. గతంలో సగటు తిరస్కరణలు 40శాతం చుట్టూ ఉండగా, ఈసారి 62శాతానికి పెరిగింది. అంటే గతంలో ఆమోదం పొందిన దరఖాస్తులు 60శాతం ఉండగా, ఇప్పుడు కేవలం 38శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఈ మార్పు ప్రధానంగా భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు.

80శాతం భారతీయ విద్యార్థులవే..

అంచనాల ప్రకారం, తిరస్కరించిన దరఖాస్తుల్లో దాదాపు 80శాతం భారతీయ విద్యార్థులవే కావచ్చని చెబుతున్నారు. ఖచ్చితమైన దేశాల వారీగా గణాంకాలు అందుబాటులో లేకపోయినా, ఆసియా మరియు ఆఫ్రికా దేశాల నుంచే ఎక్కువగా తిరస్కరణలు నమోదైనట్లు తెలుస్తోంది.

10లక్షల అంతర్జాతీయ విద్యార్థులను..

గత ఏడాది కెనడా దాదాపు 10లక్షల అంతర్జాతీయ విద్యార్థులను ఆమోదించింది. వీరిలో 41శాతం మంది భారతదేశం నుంచే వచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం విద్యార్థులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్న నేపథ్యంలో స్థానిక మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగింది. నివాస సమస్యలు, ఖర్చులు అధికం కావడం, విద్యార్థులు ఆర్థికంగా నిలబడగలరా అన్న అనుమానాల కారణంగా వీసా తిరస్కరణలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-effects-of-bathroom-door-on-health-and-wealth/

నివాస గృహాల కొరత..

కెనడాలో నివాస గృహాల కొరత విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. అద్దెల ధరలు పెరగడంతో చదువుకోడానికి వచ్చిన వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కొరత కూడా మరో అడ్డంకిగా నిలిచింది. స్థానిక ఖర్చులు కూడా విద్యార్థులకు భారమవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కెనడా ప్రభుత్వం కొత్త దరఖాస్తుల ఆమోదంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది.

జర్మనీపై ఆసక్తి..

మరోవైపు, భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను పరిశీలిస్తున్నారు. అమెరికా ఇంకా ప్రధాన ఎంపికగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల జర్మనీపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఎడ్‌టెక్‌ సంస్థ అప్‌గ్రాడ్‌ ఇచ్చిన వివరాల ప్రకారం, 2022లో అమెరికాకు 19శాతం, కెనడాకు 18శాతం భారతీయ విద్యార్థుల దరఖాస్తులు వచ్చాయి. కానీ 2025 నాటికి కెనడా కోసం దరఖాస్తుల శాతం 9కు పడిపోతుందని అంచనా వేస్తున్నారు.

2023లో అమెరికాకు దరఖాస్తులు పెరిగినప్పటికీ, కెనడా పరిస్థితులు కఠినతరం కావడంతో విద్యార్థులు జర్మనీ వైపు మళ్లుతున్నారు. జర్మనీలో విద్య ఉచితం లేదా తక్కువ ఖర్చుతో లభించడం విద్యార్థులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా అక్కడి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు విద్యార్థులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

వీసా తిరస్కరణలు కొనసాగితే..

కెనడా వీసా తిరస్కరణలు కొనసాగితే రాబోయే కాలంలో భారతీయ విద్యార్థుల ప్రవాహం గణనీయంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఆ ఖాళీని పూడ్చే అవకాశం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-effects-of-bathroom-door-on-health-and-wealth/

ఇప్పటికే విదేశీ విద్యా రంగంలో గ్లోబల్ పోటీ పెరుగుతోంది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్త అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. కెనడా పరిస్థితులు కఠినతరమవడంతో భారతీయ విద్యార్థుల దృష్టి ఇతర దేశాలపై కేంద్రీకృతమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad