Homeకెరీర్Career : డిగ్రీ దాటాక దారేది?: పీజీ పయనమా.. ప్రభుత్వ కొలువా.. గెలుపు బాట ఏది?

Career : డిగ్రీ దాటాక దారేది?: పీజీ పయనమా.. ప్రభుత్వ కొలువా.. గెలుపు బాట ఏది?

Career Guidance After Degree : డిగ్రీ పూర్తవుతున్న వేళ ప్రతి అభ్యర్థి మదిలో మెదిలే ‘మిలియన్ డాలర్ల ప్రశ్న’— ఉన్నత విద్య కోసం పీజీలో చేరాలా? లేక ప్రభుత్వ కొలువు సాధించేందుకు పోటీ పరీక్షల సమరంలోకి దూకాలేనా? సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్​ఎస్​సీ వంటి అత్యున్నత ఉద్యోగాలన్నింటికీ డిగ్రీయే ప్రామాణిక అర్హత అయినప్పుడు, పీజీ కోసం సమయం వెచ్చించడం ఎంతవరకు సబబు? త్వరితగతిన లైఫ్‌లో స్థిరపడాలంటే ఏ మార్గం రాజమార్గం? నిపుణులు సూచిస్తున్న కార్యాచరణ ఏమిటి?

- Advertisement -

రెండింటి సమన్వయమే గెలుపు బాట : పీజీ పూర్తిచేసేవరకు పోటీ పరీక్షల సన్నద్ధతను వాయిదా వేయాల్సిన అవసరం లేదని ప్రముఖ కెరీర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్నప్పుడే రోజుకు రెండు, మూడు గంటలు కేటాయిస్తూ ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు. పీజీ చేయడమూ, ఉద్యోగానికి సిద్ధమవ్వడమూ పరస్పర విరుద్ధమైనవి కావు; సమతుల్యత పాటిస్తే రెండింటినీ సమాంతరంగా నడపవచ్చు.

లక్ష్యంపై స్పష్టత.. ప్రణాళికాబద్ధమైన సాధన : ఏకకాలంలో అన్ని పరీక్షల వెంట పడితే ‘రెంటికి చెడ్డ రేవడి’లా మారే ప్రమాదముంది. సివిల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ లేదా బ్యాంకింగ్ రంగాల్లో ఒక ప్రధాన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సిలబస్‌లో సారూప్యత ఉన్న ఇతర పరీక్షలను అదనపు అవకాశాలుగా మలచుకోవాలి. డిగ్రీ అర్హతగా ఉన్న పోస్టులకు పీజీ చేసినంత మాత్రాన ప్రత్యేక వెయిటేజీ ఉండదని గ్రహించాలి.

పీజీ ఎవరికి అవసరం? ప్రత్యామ్నాయాలేంటి : బోధన, పరిశోధన, నిర్దిష్ట సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి మాత్రమే పీజీ ఉపయోగపడుతుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటే 6 నుంచి 12 నెలలు పరీక్షల సాధనకే కేటాయించవచ్చు. ఒకవేళ కుటుంబానికి తక్షణ ఆదాయం అవసరమైతే, చిన్న ఉద్యోగం లేదా కంప్యూటర్, డేటా విశ్లేషణ వంటి నైపుణ్యాలను నేర్చుకుంటూనే పార్ట్‌టైమ్‌గా లక్ష్యం దిశగా అడుగులు వేయడం వివేకవంతమైన నిర్ణయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News