Saturday, November 15, 2025
Homeకెరీర్CBSE Board Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్‌.. 10, 12వ తరగతి ఎగ్జామ్‌ డేట్‌ షీట్‌...

CBSE Board Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్‌.. 10, 12వ తరగతి ఎగ్జామ్‌ డేట్‌ షీట్‌ రిలీజ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..!

CBSE Board Exam 2026 Date Sheet Released: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 2025–26 విద్యా సంవత్సరానికి గానూ పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించిన డేట్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపింది. పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.inలో పొందుపరిచినట్లు పేర్కొంది. ఇక సీబీఎస్సీ 10వ బోర్డు పరీక్ష ఫస్ట్‌ ఫేజ్‌ పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 మద్య జరగనున్నాయి. అదే సమయంలో సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 మధ్య జరగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, చాలా సబ్జెక్టులకు పేపర్లు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు షెడ్యూల్ చేయబడ్డాయని సీబీఎస్ఈ డేట్ షీట్ను బట్టి తెలుస్తోంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/business/gemini-pro-free-subscription-for-jio-users/

సీబీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్‌ డేట్‌ షీట్‌..

భారతదేశంలోని పాఠశాలల్లో, సీబీఎస్‌ఈ అనుబంధంగా ఉన్న 26 దేశాల్లోని పాఠశాలల్లో పది, పన్నెండో తరగతులకు సంబంధించి మొత్తం 204 సబ్జెక్టులకు గానూ 45 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 146 రోజుల ముందే సెప్టెంబర్ 24న బోర్డు తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, దాదాపు నెల రోజుల తర్వాత అఫీషియల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, బోర్డు ఉత్తర్వులకు అనుగుణంగా పాఠశాలల వారీగా అభ్యర్థుల జాబితా (ఎల్‌ఓసీ)ను సకాలంలో సమర్పించినందుకు గానూ పరీక్షలకు దాదాపు 110 రోజుల ముందు సీబీఎస్‌ఈ తుది డేట్‌ షీట్‌ను జారీ చేయడం ఇదే మొదటిసారని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన సబ్జెక్టుల మధ్య గ్యాప్‌ ఇవ్వడం ద్వారా ప్రిపరేషన్‌కు తగినంత సమయం లభిస్తుందని బోర్డు పేర్కొంది. తద్వారా విద్యార్థులు సులభంగా ప్రిపేర్‌ కావొచ్చని తెలిపింది. పరీక్షల ఓవర్‌లాప్‌ల గురించిన ఆందోళనలను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. కాగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ (మెయిన్)కు దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు తమ పన్నెండో తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. కాగా, పరీక్షలు మొదలయ్యే తేదీని స్టూడెంట్స్ స్పష్టంగా గుర్తుంచుకోవాలని.. తగిన విధంగా రివిజన్ ప్లాన్ చేసుకోవాలని బోర్డు విద్యార్థులకు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020 సంస్కరణల్లో భాగంగా 10వ తరగతికి రెండు ఎగ్జామ్స్ ఛాన్సుల గురించి గతంలో చేసిన ప్రకటనతో పాటు తాజాగా ఫైనల్ డేట్ షీట్ విడుదల చేయడంతో స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఒత్తిడి తగ్గినట్లేనని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad