Homeకెరీర్KL University: కేఎల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌.. వారికి స్కాలర్‌షిప్‌ సదుపాయం

KL University: కేఎల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌.. వారికి స్కాలర్‌షిప్‌ సదుపాయం

KL University Engineering Admissions: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు, వాటి ఫలితాల వెల్లడి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 26 వ తేదీ నుంచి 30 వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారధి వర్మ వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు JEE పర్సెంటైల్, ఇంటర్ మార్కుల ఆధారంగా కూడా కౌన్సిలింగ్‌లో పాల్గొని విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంచుకోవచ్చని తెలిపారు. కౌన్సిలింగ్‌లో పాల్గొనే మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/punjab-kings-beat-delhi-capitals-by-6-wickets-chase-264-score/

యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా స్కాలర్‌షిప్‌ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News