CSIR UGC NET Application Date extend: దేశవ్యాప్తంగా ఉన్న పీజీ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుడ్ న్యూస్ తెలిపింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పెంచింది. మొదట దరఖాస్తు చివరి తేదీగా అక్టోబర్ 25ను నిర్ణయించగా.. తాజాగా ఆ గడువును మరో రెండు రోజులు పెంచింది.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ దరఖాస్తు చివరి తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెంచింది. అభ్యర్థుల సౌకర్యం కోసం ఈ గడువును పెంచినట్టుగా ఎన్‌టీఏ పేర్కొంది. మొదట దరఖాస్తు చివరి తేదీగా అక్టోబర్ 25ను నిర్ణయించగా.. తాజాగా అక్టోబర్ 27, 2025 వరకు పొడిగించింది. దీంతో ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం అభ్యర్థులు అక్టోబర్ 28, 2025 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. దరఖాస్తులో ఏవైనా తప్పులు దిద్దుకునే సౌకర్యం కోసం కరెక్షన్ విండోను సైతం ఎన్‌టీఏ అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 1, 2025 వరకు ఈ కరెక్షన్ విండో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 18, 2025న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో.. రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కండక్ట్ చేస్తారు. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థుల సౌకర్యం కోసం ప్రశ్నపత్రం హిందీతో పాటుగా ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అయితే.. రెండు భాషల మధ్య ఏవైనా భిన్న సమస్యలు తెలెత్తుతే ఆంగ్ల వెర్షన్‌నే తుది పరిగణనగా తీసుకోనున్నట్టుగా తెలిపారు. పూర్తి వివరాలను csirnet.nta.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొంది.


