Homeకెరీర్Jobs: టెన్త్ పాసైతే చాలు.. ‘మై భారత్‌ యువ వాలంటీర్‌’గా ఉద్యోగం పొందే ఛాన్స్‌

Jobs: టెన్త్ పాసైతే చాలు.. ‘మై భారత్‌ యువ వాలంటీర్‌’గా ఉద్యోగం పొందే ఛాన్స్‌

విశాఖపట్నం (తెలుగు ప్రభ): కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై భారత్–నేషనల్ యూత్ కార్ప్స్ (ఎన్ వైసీ) పథకంలో భాగంగా మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి గతేడాది (2025–26) ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరిన విషయం తెల్సిందే. అయితే ఆ దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 27తేదీ వరకు పొడిగించారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

- Advertisement -

విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన యువ వలంటీర్లు ఏడాది పాటు మై భారత్ యువ వలంటీర్లుగా సేవలoదించాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ఏప్రిల్ 1, 2025 నాటికి 18ఏళ్ల నుంచి 29ఏళ్ల మధ్య వయసున్న వారంతా అర్హులేనన్నారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారంతా

https://nyks.nic.in/nycapp/strmainnycapp.asp అనే లింక్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News