Ambedkar Open University: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ యూజీ, పీజీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపునకు ఆగస్టు 7ను చివరి తేదీగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ అర్హతలు: దేశంలోని అర్హులైన పౌరులెవరైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. అయితే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని అధ్యయన కేంద్రాలను (Study Centers) మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెన్త్ క్లాస్ తర్వాత రెండేళ్ల డిప్లొమా, ఐటీఐ (ITI), పాలిటెక్నిక్ లేదా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజును ఆగస్టు 7 లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. డిగ్రీ (2021-22 నుండి 2025-26 బ్యాచ్‌లు), పీజీ (2023-24 నుండి 2025-26 బ్యాచ్‌లు) చదువుతూ సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు కూడా ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్‌లైన్(TS Online) ద్వారా ఫీజు చెల్లించి అడ్మిషన్ పునరుద్ధరించుకోవచ్చు.
Also read- టిమ్స్‌లో కొలువుల జాతర.. జులై 6 లోగా దరఖాస్తుకు అవకాశం!
సమాచారం కోసం సంప్రదించండి: కోర్సుల వివరాలు, ఫీజుల సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్లు www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని గానీ లేదా 7382929570, 040-23680222 / 333 / 555 హెల్ప్ డెస్క్ నంబర్లను గానీ సంప్రదించవచ్చు
అందుబాటులో ఉన్న కోర్సులు:
- యూజీ (డిగ్రీ): బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ.
- పీజీ: ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్).
- ఎం.కాం & ఎం.ఎస్సీ: బోటనీ, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్.
- ఇతర కోర్సులు: ఎం.ఎల్ఐఎస్సి (M.LI.Sc), వివిధ డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులు.

