Saturday, November 15, 2025
Homeకెరీర్Dual Degree: డ్యూయల్ డిగ్రీ కోర్సుకు నోటిఫికేషన్‌.. ఈ నెల 13న కౌన్సిలింగ్‌

Dual Degree: డ్యూయల్ డిగ్రీ కోర్సుకు నోటిఫికేషన్‌.. ఈ నెల 13న కౌన్సిలింగ్‌

Dual Degree Course at Agricultural University: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వాక్-ఇన్-కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్​ఆర్​ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్​ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్​(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీఎస్సీ (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుందని తెలిపారు.

- Advertisement -

ఈ రెండు కౌన్సిలింగ్ లు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్​ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సిలింగ్‌కు రావాలని కోరారు. వెబ్ సైట్‌లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని తెలిపారు.

Also Read: https://teluguprabha.net/career-news/ap-ssc-10th-exams-2026-schedule-fees/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad