Saturday, November 15, 2025
Homeకెరీర్EMRS Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7 వేలకు పైగా టీచర్ పోస్టులు.. ఎంపికైతే రూ.2...

EMRS Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7 వేలకు పైగా టీచర్ పోస్టులు.. ఎంపికైతే రూ.2 లక్షల జీతం

EMRS Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (EMRS).. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ పడింది. ఈఎంఆర్ఎస్ లోని టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7,267 టీచర్‌, నాన్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఇంటర్‌, టెన్త్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు, పీజీటీకి 40 ఏళ్లు, టీజీటీకి 35 ఏళ్లు, అకౌంటెంట్‌కు 30 ఏళ్లు, ల్యాబ్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు, హాస్టల్‌ వార్డెన్‌, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లుగా నిర్ణయించారు.

- Advertisement -

పోస్టుల వివరాలు ఇవే..

  • ప్రిన్సిపల్‌ పోస్టుల సంఖ్య: 225
  • పీజీటీ పోస్టుల సంఖ్య: 1,460
  • హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌) పోస్టుల సంఖ్య: 346
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (క్లర్క్‌) పోస్టుల సంఖ్య: 228
  • అకౌంటెంట్‌ పోస్టుల సంఖ్య: 61
  • స్టాఫ్‌ నర్స్‌ (ఫీమేల్‌) పోస్టుల సంఖ్య: 550
  • టీజీటీ పోస్టుల సంఖ్య: 3,962
  • హాస్టల్‌ వార్డెన్‌ (ఫీమేల్‌) పోస్టుల సంఖ్య: 289
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 146

Read also: Black Eyed Peas: పిడికెడు గింజలు తింటే చాలు.. పుష్కలమైన లాభాలు..!

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ఆధారంగా అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్‌ పోస్టుకు దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు రూ.500 ఫీజుగా ఉంది. టీజీటీ, పీజీటీ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు రూ.2,000, నాన్‌-టీచింగ్‌ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు రూ.1,500… ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళా అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

నెల జీతం ఎలా ఉంటుందంటే..

  • ప్రిన్సిపల్‌ పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు
  • పీజీటీ పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు
  • టీజీటీ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
  • అకౌంటెంట్‌ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు
  • హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు
  • ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు
  • జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు

Read also:Axar Patel: పాక్ తో మ్యాచ్ ముందు భారత్ కు షాక్.. స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad