వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) తమ ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే VITEEE 2027 దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. బి.టెక్ (B.Tech) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీర్లు కావాలని ఆశించే విద్యార్థులు తమ కలల వృత్తి వైపు అడుగు వేసేందుకు ఇది ఒక చక్కని అవకాశం. ప్రకటించిన వివరాల ప్రకారం, విద్యార్థులు www.viteee.vit.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెల్లూర్, చెన్నై, అమరావతి (ఆంధ్రప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్) క్యాంపస్లలో అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ చేపట్టారు.
VITEEE 2027 పరీక్ష ఒకే దశలో 2027 ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా 133 నగరాల్లో, అంతర్జాతీయంగా 9 కేంద్రాల్లో జరుగుతుంది. దీనివల్ల భారత్తో పాటు విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అవకాశం కలుగుతుందని విట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

