Monday, May 13, 2024
Homeకెరీర్Hyd: హైదరాబాద్ లో 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023'

Hyd: హైదరాబాద్ లో ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’

ప్రపంచవ్యాప్తంగా 100+ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమం ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈనెల 10వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమవ్వనుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో అధ్యయనానికి విద్యార్థులను ఇది సన్నద్ధం చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’ని నిర్వహిస్తోంది.
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కి పైగా విదేశీ విశ్వవిద్యాలయాలకి చెందిన 60 మందికి పైగా ప్రతినిధులు ఒక రోజు పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు. స్టూడెంట్ లోన్లని అందించే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రిపరేషన్ టెస్ట్ ఏజెన్సీలైన ఈటీఎస్, పీటీఈ, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారెక్స్ రెమిటర్ లు వంటి వివిధ భాగస్వాములు హాజరై విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చి.. వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News