IBPS Notification: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సుమారు 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలలో తెలుగు రాష్ట్రాల వారికి సైతం అధికంగా ప్ర. తెలంగాణలో 191 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థుల విద్యార్హతలు& వయోపరిమితి: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్‌లో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
Also Read-TGSET: టీజీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు గడువు & జీతభత్యాలు : ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి (ఆగస్టు-1)నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (PWD) అభ్యర్థులకు రూ. 175 కాగా, మిగిలిన ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ. 850గా దరఖాస్తు రుసుమును నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,000 నుంచి రూ. 64,000 వరకు వేతనం లభిస్తుంది. నియామక ప్రక్రియలో భాగంగా అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోపు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

