ICAI CA Final and Intermediate September 2025 results today: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సెప్టెంబర్ సెషన్ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను సోమవారం (నవంబర్ 3) ప్రకటించనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది. అధికారిక నోటీసు ప్రకారం.. సీఏ ఫైనల్ ఇంటర్మీడియట్ ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇక ఫౌండేషన్ స్థాయి పరీక్షా ఫలితాలను సైతం ఇదే రోజు విడుదల చేయనున్నట్లు తెలిపింది. విద్యార్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదంటే రోల్ నంబర్ అధికారిక వెబ్‌సైట్‌లో www.icaiexam.icai.org లేదా icai.nic.in/caresult నమోదు చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సీఏ ఫౌండేషన్ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో జరిగింది. సీఏ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే, ఓవరాల్ అగ్రిగేట్ 50% కనీస స్కోరు సాధించాలి. మొత్తం 70% లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు “డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణత” హోదాను పొందుతారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1. ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ https://icai.nic.in/caresult/ ఓపెన్ చేయండి.
2. సీఏ ఫౌండేషన్ లేదా సీఏ ఇంటర్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయండి.
3. మీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేసి, ఎంటర్ క్లిక్ చేయండి.
4. మీ రిజల్ట్ చెక్ చేసుకోండి.
ఏడాదికి మూడు సార్లు పరీక్ష..
2023 విద్యా సంవత్సరం వరకు సీఏ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించేవారు. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి పరీక్షలను ఏడాదికి మూడు సార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది. 2024 మార్చి 7వ తేదీన జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 430వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంటే 2023 వరకు సీఏ పరీక్షలు రెండు సార్లు అంటే మే లేదా జూన్ మాసంలో ఒకసారి.. నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో రెండో సారి జరిగేవి. అయితే, 2024 నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలు మూడు సార్లు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి, మే, జూన్,సెప్టెంబర్ మాసాల్లో సీఏ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని (ICAI) నిర్ణయం తీసుకుంది.
సీఏ పరీక్షకు అర్హులు వీరే..
ఇంటర్మీడియట్ పాసైన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షను మూడు స్థాయిల్లో నిర్వహిస్తారు. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు ఉంటాయి. తొలుత ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సీఏ ఇంటర్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్‌లో రెండు గ్రూప్‌లు పాసైన వారికి మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.


