Homeకెరీర్ICET: ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 31 నుంచి ప్రారంభం!

ICET: ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 31 నుంచి ప్రారంభం!

ICET Counseling: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ (TS ICET) కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రవేశాల కన్వీనర్ దేవసేన వెల్లడించారు. రెండు విడతలుగా ఈ కౌన్సెలింగ్ నిర్వహించి కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు కొనసాగుతుంది. చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 17 నుంచి 25 వరకు ఉండనుందని కన్వీనర్ దేవసేన తెలిపారు. ఆగస్టు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

- Advertisement -

గత విద్యాసంవత్సరంతో పోల్చుతే తగ్గిన సీట్లు: ఈసారి ఐసెట్ కౌన్సెలింగ్ ద్వారా సుమారు 46,654 మంది సీట్లు పొందే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరంలో 287 ఎంబీఏ కాలేజీల్లో 40,601 సీట్లు ఉండగా 35,141 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే 80 ఎంసీఏ కాలేజీల్లోని 9,360 సీట్లలో 5,420 సీట్లు నిండాయి. అయితే ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) పరిధిలోని 12 కళాశాలల్లో దాదాపు 1,400 ఎంబీఏ సీట్లకు కోత పడినట్లు సమాచారం.

తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే:

  • జూలై 31 – ఆగస్టు 5: ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్.
  • ఆగస్టు 1 నుండి 5 వరకు: అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification).
  • ఆగస్టు 3 నుండి 8 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు.
  • ఆగస్టు 11 లోపు: కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు.
  • ఆగస్టు 11 నుండి 14 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు మరియు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News