Sunday, November 16, 2025
Homeకెరీర్India Post Scholarship 2025: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ...

India Post Scholarship 2025: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ స్కాలర్‌షిప్‌.. ఎలా పొందాలంటే!

India Post Scholarship 2025 : ఇండియా పోస్ట్‌ 2025-26 విద్యా సంవత్సరానికి తెలుగు రాష్ట్రాల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌-2025’ అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు సెప్టెంబరు 13, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌ ఫిలాటలీ (తపాలా బిళ్లల సేకరణ) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించబడింది.

- Advertisement -

ALSO READ: YS Viveka Murder : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 కు సుప్రీం బెయిల్

స్కాలర్‌షిప్‌ ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చరిత్ర, క్రీడలు, సామాన్య శాస్త్రం, జనరల్‌ నాలెడ్జ్, స్టాంపులపై 50 ప్రశ్నలు ఉంటాయి. అర్హత సాధించిన వారు రెండో దశలో 16 స్టాంపులతో 4-5 పేజీల ప్రాజెక్టు వర్క్‌ సమర్పించాలి. ఈ ప్రాజెక్టును తపాలా ద్వారా సంబంధిత రీజినల్‌ తపాలాశాఖ కార్యాలయానికి పంపాలి.

ఎంపికైన 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో ప్రతీ తరగతి నుంచి 10 మంది చొప్పున, మొత్తం 40 మందికి నెలకు రూ.500 చొప్పున, ఏడాదికి రూ.6,000 స్కాలర్‌షిప్‌ అందుతుంది. హైదరాబాద్‌, విజయవాడలోని తపాలాశాఖ అధికారులు మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప తపాలాశాఖ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని సంప్రదించండి.

దరఖాస్తు లింక్‌: ఇక్కడ క్లిక్‌ చేయండి
గడువు: సెప్టెంబరు 13, 2025

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad