భారతీయ రైల్వేలో(Indian Railways) వేర్వేరు కేటగిరీల్లో 1,036 ఖాళీలు ఉన్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) ప్రకటించింది. అయితే జనవరి 7, 2025 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. ఉద్యోగ అర్హతలు, దరఖాస్తు ఫీజు, రిజర్వేషన్లు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలపై నోటిఫికేషన్ విడుదల అయ్యాకే స్పష్టత రానుంది.
ఖాళీలు ఇవే..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ -187,
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ -338,
జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ- 130,
ప్రైమరీ రైల్వే టీచర్- 188,
చీఫ్ లా అసిస్టెంట్-54, పబ్లిక్ ప్రాసిక్యూటర్-20,
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్(ఇంగ్లీష్ మీడియం)-18,
సైంటిఫిక్ అసిస్టెంట్ -02,
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్- 03,
సైంటిఫిక్ సూపర్వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) -03,
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్-59, లైబ్రేరియన్-10,
సంగీత ఉపాధ్యాయుడు (ఉమెన్స్)- 03,
అసిస్టెంట్ టీచర్ (ఫిమేల్ జూనియర్ స్కూల్)-02,
ల్యాబ్ అసిస్టెంట్ / స్కూల్-07,
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3(కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్)-12