Homeకెరీర్Intermediate admissions 2025: ఇంటర్ అడ్మిషన్లకు రేపే లాస్ట్ డేట్ మరి.. అప్రమత్తంగా ఉన్నారా!

Intermediate admissions 2025: ఇంటర్ అడ్మిషన్లకు రేపే లాస్ట్ డేట్ మరి.. అప్రమత్తంగా ఉన్నారా!

Intermediate admissions 2025 Deadline: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత అడ్మిషన్లు ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో, రెండో విడత ప్రవేశాల గడువు ఆగస్టు 31, 2025తో ముగియనుంది. అర్హులైన 10వ తరగతి విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ గడువు తర్వాత మళ్లీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.

- Advertisement -

ALSO READ: Nara Lokesh : టీడీపీ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న నారా లోకేష్

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. మే 1 నుంచి మొదలైన తొలి విడత జూన్ 30తో ముగిసింది. రెండో విడత గడువు ఆగస్టు 31తో సమాప్తం కానుంది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు, డిప్లోమా వంటి కోర్సుల్లో సీటు రాని వారు, ఇతర కారణాలతో జూనియర్ కళాశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు.

అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆగస్టు 31 గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేరాలని, గుర్తింపు జాబితా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో (https://tgbie.cgg.gov.in/) అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. అడ్మిషన్ సమయంలో ఆధార్ నెంబర్ నమోదు తప్పనిసరి, అలాగే ప్రతి రోజూ అడ్మిషన్ వివరాలను కళాశాల బోర్డులో ప్రదర్శించాలి.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిసేలోపు అడ్మిషన్ పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. జూన్ 2, 2025 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కాబట్టి, ఆలస్యం చేయకుండా వెంటనే చేరండి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News