JEE Main 2026: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 మొదటి సెషన్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. శనివారం సాయంత్రం పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ (Provisional Answer Key) తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి: అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి.. తమ అప్లికేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా రెస్పాన్స్ షీట్‌తో పాటుగా ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్టీఏ విడుదల చేసిన ఆన్సర్ కీలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే వారు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి రూ. 200 నాన్-రీఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆబ్జెక్షన్ విండో సాధారణంగా 2 నుండి 3 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఏప్రిల్ 20న ఫలితాలు: అభ్యర్థుల నుండి వచ్చిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అనంతరం తుది కీని ఖరారు చేసి.. ఏప్రిల్ 20వ తేదీ నాటికి సెషన్ 1 ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

