Sri Chaitanya Educational Institutions: JEE Main 2026 ఫలితాల్లో శ్రీచైతన్య సంచలన రికార్డ్ సృష్టించింది. ఇద్దరికి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌లు సాధించింది. B.V.C శేఖర్ రెడ్డితో పాటు మరొక విద్యార్థి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో పసల మోహిసత్ ఈ ఘనత సాధించాడు. వీరితో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 8వ ర్యాంకు ఆరుష్ సింఘాల్, 11వ ర్యాంకు యశ్వర్ధన్, 15వ ర్యాంకు జేఆర్ మణిదీప్ రెడ్డి, సాధించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 3 ర్యాంకులతో పాటు, 1000 లోపు గతేడాది కంటే అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధించి రికార్డు సృష్టించారు.
Also Read: https://teluguprabha.net/telangana/bjp-chief-allegations-on-cm-revanth-reddy-and-ex-cm-kcr/
- శ్రీచైతన్య అకాడమీ AIR 98, 107, 396, 826 వంటి టాప్ ర్యాంకులను సాధించింది.
- శ్రీచైతన్య అకాడమీ, బెంగళూరు విద్యార్థి నిశాంక్ వ్యాస్ AIR 396 సాధించాడు.
Also Read: https://teluguprabha.net/national-news/massive-explosion-at-fireworks-factory-in-kerala-six-dead/
ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా JEE MAINలో వరుసగా 300కి 300 మార్కులు సాధిస్తూ హ్యాట్రిక్ రికార్డు సృష్టించడం ఓక్క శ్రీచైతన్యకే సాధ్యమైందన్నారు. శ్రీచైతన్య అందించే మైక్రో షెడ్యూల్స్, నిరంతరం ఇంటర్నల్ ఎగ్జామ్స్, దేశంలోని అత్యుత్తమ ఫ్యాకల్టీతో పాటు అధునాతన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ విజయానికి వెన్నెముకగా నిలిచాయని హర్షం వ్యక్తం చేశారు. శ్రీచైతన్య విజయ ప్రస్థానంలో ఇన్ఫినిటీ లెర్న్ ఆలన్‌లైన్ యాప్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఏఐ, అత్యున్నత సాంకేతికతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్, విద్యార్థులకు వ్యక్తిగత విశ్లేషణలు, మెరుగైన అభ్యాసన అనుభవాన్ని అందిస్తూ వారిని జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులకు, తోడ్పాటునందించిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీచైతన్య యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.

