CCMB Hyderabad: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం.. అప్లికేషన్ ప్రింట్ అవుట్‌ను పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీలు:
1. టెక్నీషియన్ (22 ఖాళీలు):
- అర్హత: 55% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ (ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫుడ్ ప్రొడక్షన్)లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా 10వ తరగతితో పాటు రెండేళ్ల అప్రెంటిస్ అనుభవం ఉండాలి.
- వయస్సు: గరిష్టంగా 28 ఏళ్లు.
2. డ్రైవర్ (01 ఖాళీ):
- అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత. లైట్ & హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు. ఎస్సీ లేదా ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు:
- స్టేజ్-1: ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ (అర్హత సాధించాల్సి ఉంటుంది).
- స్టేజ్-2: రాత పరీక్ష (మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, సబ్జెక్ట్ నాలెడ్జ్). తుది ఎంపిక పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
- జనర ల్లేదా ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: ₹500
- ఎస్సీ ల్లేదా ఎస్టీ మరియు మహిళలు, దివ్యాంగులకు: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26 మే 2026.
- హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ: 05 జూన్ 2026.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్షన్ ఆఫీసర్, సీఎస్‌ఐఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ – 500007.

