Sunday, November 16, 2025
Homeకెరీర్TG Govt Jobs 2025: రాత పరీక్ష లేదు... నేరుగా ఇంటర్వ్యూతోనే సర్కారీ ఉద్యోగం!

TG Govt Jobs 2025: రాత పరీక్ష లేదు… నేరుగా ఇంటర్వ్యూతోనే సర్కారీ ఉద్యోగం!

Nalgonda Medical College recruitment : తెలంగాణలోని నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్తే… ఎలాంటి రాత పరీక్షల ప్రయాస లేకుండా, కేవలం ఒక్క ఇంటర్వ్యూతోనే ప్రభుత్వ రంగంలో వైద్య కొలువును సొంతం చేసుకునే సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏకంగా 113 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి..? అర్హతలు ఏమిటి..? జీతం ఎంత ఉంటుంది..? ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం..

- Advertisement -

కొలువుల పూర్తి వివరాలు : నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ, రెసిడెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులను వారి విద్యార్హతలు, బోధనానుభవం, మరియు వాక్-ఇన్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 113 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రొఫెసర్: 04
అసోసియేట్ ప్రొఫెసర్: 14
అసిస్టెంట్ ప్రొఫెసర్: 21
ట్యూటర్: 09
సీనియర్ రెసిడెంట్స్: 37
జూనియర్ రెసిడెంట్స్: 28
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 06

విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, లేదా ఎమ్మెస్సీ (మెడికల్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో బోధన లేదా పరిశోధన అనుభవం తప్పనిసరి.
రిజిస్ట్రేషన్: అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

పోస్టుల వారీగా గరిష్ట వయోపరిమితి
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు: నోటిఫికేషన్ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఇతర అన్ని పోస్టులకు: నోటిఫికేషన్ తేదీ నాటికి 69 ఏళ్లు మించకూడదు.
ప్రాధాన్యత: తెలంగాణ రాష్ట్ర స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.

జీతభత్యాల వివరాలు : ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు అందించనున్నారు.

ప్రొఫెసర్: రూ. 1,90,000
అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 1,50,000
అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,25,000
సీనియర్ రెసిడెంట్: రూ. 1,06,461
ట్యూటర్: రూ. 55,000
జూనియర్ రెసిడెంట్: రూ. 46,000
సివిల్ అసిస్టెంట్ సర్జన్: రూ. 52,000

ఇంటర్వ్యూ వేదిక  – తేదీ : అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

తేదీ: జులై 23, 2025
చిరునామా: ప్రిన్సిపాల్ చాంబర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నల్గొండ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad