NEET UG Entrance Exam 2026: దేశవ్యాప్తంగా నీట్ యూజీ(NEET UG) 2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వాటిలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో జరిగింది.
నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిబంధనలు అమలు చేశారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎవరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. తెలంగాణ నుంచి సుమారు 75,000 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 70,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం.

