Friday, February 13, 2026
HomeTop StoriesGoogle: మీ కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడిందా?.. అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే!

Google: మీ కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడిందా?.. అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే!

Career Dreamer: చదువు పూర్తయ్యాక ఏ ఉద్యోగంలో చేరాలో తెలియక సతమతమయ్యే విద్యార్థులకు, చేస్తున్న వృత్తి బోర్ కొట్టి కొత్త రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి గూగుల్ తీపి కబురు అందించింది. కృత్రిమ మేధ (AI) సాయంతో పనిచేసే ‘కెరీర్ డ్రీమర్’ (Career Dreamer) అనే సరికొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇది మీ నైపుణ్యాలను విశ్లేషించమే కాకుండా మీకు ఏ కెరీర్ సెట్ అవుతుందో దిశానిర్దేశం చేస్తుంది.

- Advertisement -

మీ నైపుణ్యాలే మీ గుర్తింపు: చాలామందికి తమలో ఉన్న అసలైన నైపుణ్యాలు (Skills) ఏంటో, వాటికి తగ్గ ఉద్యోగాలు మార్కెట్లో ఎక్కడ ఉన్నాయో తెలియదు. ‘కెరీర్ డ్రీమర్’ ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తుంది. యూజర్లు తమ గత అనుభవాలు, చేసిన పనుల వివరాలను ఇక్కడ నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని విశ్లేషించి ఈ టూల్ ఒక కెరీర్ ఐడెంటిటీ స్టేట్‌మెంట్‌ను సిద్ధం చేస్తుంది. అంటే మీ బలాబలాలు ఏంటో ఇది స్పష్టంగా చెబుతుంది.

Also Read-Good news: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

భవిష్యత్తుపై పూర్తి సమాచారం: కేవలం ఉద్యోగాలను సూచించడమే కాకుండా ఆ వృత్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ టూల్ మన ముందుంచుతుంది. ఆ ఉద్యోగంలో సగటు జీతం ఎంత ఉండొచ్చనేది తెలుపుతుంది. కావాల్సిన చదువు మరియు ఇతర స్కిల్స్ ఏం ఉండాలనేది సైతం వెల్లడిస్తుంది. అలాగే ఆఫీసులో ఒక సాధారణ రోజు ఎలా గడుస్తోందో కూడా పేర్కొంటుంది. అంతేకాకుండా చేయాల్సిన పనులేంటి.. భవిష్యత్తులో ఆ రంగంలో ఎదిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అనే పూర్తి సమాచారాన్ని ఈ టూల్‌ అందిస్తుంది.

ఏఐ (AI) తో శిక్షణ: కెరీర్ డ్రీమర్ ప్లాట్‌ఫారమ్ గూగుల్ ఏఐ లెర్నింగ్ రిసోర్సెస్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చిన ఉద్యోగానికి ఏదైనా కొత్త కోర్సు అవసరమైతే.. ‘Learn More’ ఆప్షన్ ద్వారా నేరుగా శిక్షణ పొందవచ్చు. అలాగే, గూగుల్ ‘జెమినీ’ (Gemini) సాయంతో మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన ప్రణాళికను కూడా రూపొందించుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలు ఒక సూపర్ పవర్ లాంటివి. వాటిని సరైన మార్గంలో పెడితే అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చు.. అని ఈ సందర్భంగా గూగుల్ పేర్కొంది. నిరుద్యోగులు, విద్యార్థులు తమ కెరీర్ ప్రయాణంలో స్పష్టత తెచ్చుకోవడానికి ఈ ఉచిత టూల్ ఎంతో ఉపయోగపడనుంది

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News