Saturday, November 15, 2025
Homeకెరీర్Railway Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్‌

Railway Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్‌

North Eastern Railway Releases Notification: నిరుద్యోగులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వేల పరిధిలోని అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1104 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా ఇండియన్‌ రైల్వే పరిధిలోని నార్త్ ఈస్టర్న్‌ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 15వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

- Advertisement -

నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అనేది 2025 అక్టోబర్‌ 16వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ఆధారంగా నవంబర్‌ 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదని నార్త్ ఈస్టర్న్‌ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి నిబంధనల మేరక స్టైపెండ్‌ చెల్లించనున్నట్టుగా పేర్కొంది.

అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు ఇవే:

  • గోరఖ్‌పుర్‌లో మెకానికల్ వర్క్‌షాప్‌ ఖాళీల సంఖ్య: 390
  • లక్నోలో క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ ఖాళీల సంఖ్య: 149
  • ఇజ్జత్‌నగర్‌లో మెకానికల్ వర్క్‌షాప్‌ ఖాళీల సంఖ్య: 142
  • గోండలో డీసిల్‌ షెడ్ ఖాళీల సంఖ్య: 88
  • వారణాసిలో క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ ఖాళీల సంఖ్య: 73
  • ఇజ్జత్‌నగర్‌లో క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ ఖాళీల సంఖ్య: 64
  • గోరఖ్‌పుర్‌లో సిగ్నల్‌ వర్క్‌షాప్‌ ఖాళీల సంఖ్య: 63
  • ఇజ్జత్‌నగర్‌లో డీసిల్‌ షెడ్‌ ఖాళీల సంఖ్య: 60
  • వారణాసిలో టీఆర్‌డీ ఖాళీల సంఖ్య: 40
  • గోరఖ్‌పుర్‌లో బిడ్జి వర్క్‌షాప్‌ ఖాళీల సంఖ్య: 35
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad