TGPSC: టీజీపీఎస్సీ నుండి మరో నోటిఫికేషన్ విడుదలయింది. సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తికల్గిన అభ్యర్థులు ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో ఎంఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి అర్హత: జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే వయో సడలింపులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు:
- ఓసీ, బీసీ అభ్యర్థులకు: రూ. 1,000
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు: రూ. 500
- పరీక్ష ఫీజు: అదనంగారూ. 80 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు (రూ. 80) నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ ఫీజును తప్పనిసరిగా చెల్లించాలి.
Also Read-Railway: రైల్వే శాఖలో కొలువుల నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక కేవలం ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే రాత పరీక్ష మెరిట్ ఆధారంగా జరుగుతుంది. మొత్తం మార్కులు 300 మార్కులకు గాను రెండు పేపర్లు ఉండనున్నాయి.
- పేపర్ – 1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు
- పేపర్ – 2: సంబంధిత సబ్జెక్ట్ (పీజీ స్థాయి) – 150 మార్కులు

