Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 745 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి విధులు కేటాయించే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ లాంటి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 745 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థుల వయోపరిమితి&దరఖాస్తు రుసుము : అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులకు ఐబీపీఎస్ దరఖాస్తు రుసుముగా రూ. 850లను నిర్ణయించింది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం రూ. 175గా పేర్కొంది. అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి జులై 21, 2026 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జులై 21, 2026
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ & ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026
- ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: సెప్టెంబర్/అక్టోబర్ 2026
- ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష: నవంబర్ 2026
- ఇంటర్వ్యూల నిర్వహణ: నవంబర్/డిసెంబర్ 2026
- తుది ఎంపిక జాబితా వెల్లడి: జనవరి 2027

