ONGC Recruitment 2025 : నిరుద్యోగ యువతకు పండుగలా మరింత వార్త వచ్చింది. ఓయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఢిల్లీ 2025-26కు 2623 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అర్హత ఉన్నవారు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు ఆన్‌లైన్ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. స్టైపెండ్ రూ.9,600 నుంచి రూ.12,300 వరకు. 18-24 ఏళ్ల మధ్య వయసు (రిజర్వేషన్‌లకు సడలింపు). వివిధ సెక్టార్ల్లో 165 నుంచి 856 వరకు పోస్టులు. దరఖాస్తు ఫీజ్ లేదు. అప్లై చేయండి!
ALSO READ: Telugu University: ఏపీలో కొత్త తెలుగు విశ్వవిద్యాలయం: ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం
ONGC భారతదేశంలో పెట్రోలియం, గ్యాస్ రంగంలో ప్రధాన సంస్థ. 2623 అప్రెంటిస్ పోస్టులు వివిధ సెక్టార్ల్లో ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిటర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్ మెకానిక్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది
సెక్టార్‌ల వివరాలు:
1. నార్తర్న్ సెక్టార్: 165 పోస్టులు
2. ముంబై సెక్టార్: 569 పోస్టులు
3. వెస్టర్న్ సెక్టార్: 856 పోస్టులు
4. ఈస్టర్న్ సెక్టార్: 458 పోస్టులు
5. సౌతర్న్ సెక్టార్: 322 పోస్టులు
6. సెంట్రల్ సెక్టార్: 253 పోస్టులు
విద్యార్హత: ITI, డిప్లోమా, గ్రాడ్యుయేషన్ (పోస్ట్‌కు తగినట్టు). వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రాధాన్యత.
వయసు: 18-24 సంవత్సరాలు (SC/STకి 5 ఏళ్లు, OBCకి 3 ఏళ్లు, PwBDకి 10 సంవత్సరాలు సడలింపు).
స్టైపెండ్: ITI అప్రెంటిస్ రూ.9,600-10,560; డిప్లోమా రూ.10,900; గ్రాడ్యుయేట్ రూ.12,300.
అప్లై విధానం: ఆన్‌లైన్ మాత్రమే (ongcapprenticeships.in). ఫీజ్ లేదు.
ఎంపికా: మెరిట్ ఆధారంగా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాయినింగ్.
అప్లై చేయండి! మరిన్ని వివరాలకు ongcindia.com చూడండి.


