Monday, February 16, 2026
Homeకెరీర్Open degree: ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్‌ రిలీజ్‌.. 17 నుంచి పరీక్షలు

Open degree: ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్‌ రిలీజ్‌.. 17 నుంచి పరీక్షలు

Open degree exams postponed: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తూ డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు. హాల్‌టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పూర్తి షెడ్యూల్‌ కోసం, మరింత సమాచారం కోసం www.braou.ac.in వెబ్‌సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News