Railway Recruitment Board: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా భర్తీ చేయనున్న 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగియగా.. లక్షలాది మంది అభ్యర్థులు ప్రస్తుతం పరీక్షా తేదీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పరీక్షలు ఎప్పుడు ఉండవచ్చు?: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అందించిన తాజా సమాచారం ప్రకారం గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెల ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే.. మే నెలలోనే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పరీక్ష సెంటర్ ఏ నగరంలో ఉంటుందనే సమాచారం పరీక్షకు 10 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ మాత్రం పరీక్ష తేదీకి 4 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షా సరళి: గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ రెండు విభాగాలకు సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది 100మార్కులకు ఉంటుంది. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమయం 90 నిముషాలు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
Also read-Open degree: ఓపెన్ డిగ్రీ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్ రిలీజ్.. 17 నుంచి పరీక్షలు
ఫిబ్రవరి 11న సీబీటీఎస్‌టీ రీ-షెడ్యూల్ పరీక్ష: మరోవైపు గతంలో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ (సీబీటీఎస్‌టీ)కు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28న జరిగిన పరీక్షకు హాజరై.. సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర ఇబ్బందుల వల్ల రీ-షెడ్యూల్ కోరుకున్న అభ్యర్థుల కోసం ఫిబ్రవరి 11న తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శిస్తూ తాజా సమాచారాన్ని గమనించాలని బోర్డు సూచించింది.

