Monday, February 16, 2026
Homeకెరీర్RRB: రైల్వేలో ఉద్యోగాల జాతర.. ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

RRB: రైల్వేలో ఉద్యోగాల జాతర.. ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Isolated Category posts: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

- Advertisement -

ముఖ్య సమాచారం: చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్మీడియట్, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఎంబీఏ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆసక్తిగల ఆభ్యర్థుల వయోపరిమితి 01.01.2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ. 19,000 నుంచి రూ. 44,900 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.జనరల్ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,మహిళలు,మైనారిటీ అభ్యర్థులకు రూ. 250 ఉంటుంది.

పోస్టు వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య- 312

  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌- 202
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3- 39
  • స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌- 24
  • చీఫ్ లా అసిస్టెంట్- 22
  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌- 15
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్- 07
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- 02
  • సైంటిఫిక్‌ సూపర్వైజర్‌- 01

ఎంపిక విధానం: అభ్యర్థులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. అంతేకాకుండా అవసరమైన పోస్టులకు ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. సికింద్రాబాద్ సహా చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన రీజియన్ల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభం- 30.12.2025
  • దరఖాస్తుకు చివరి తేదీ- 29.01.2026
  • ఫీజు చెల్లింపు గడువు- 31.01.2026
  • దరఖాస్తు సవరణ తేదీలు- ఫిబ్రవరి 01 నుండి 10 వరకు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News