Railway Recruitment Board: భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఒకేసారి రెండు తీపి కబుర్లు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెక్షన్ కంట్రోలర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడ్డాయి.
సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు: రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులై ఉండాలి. జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 బేసిక్ పే లభిస్తుంది. జులై 15, 2026 నుంచి ఆగస్టు 14, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
Also Read-SBI PO: ఎస్‌బీఐలో 1500 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22 లక్షల ప్యాకేజీతో బంపర్ చాన్స్!
రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీ: ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 6,565 టెక్నీషియన్ (గ్రేడ్-1, గ్రేడ్-3) పోస్టుల భర్తీకి జూన్ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు పోస్టులను బట్టి టెన్త్, ఐటీఐ (ITI), డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కల్గిన అభ్యర్థుల నుండి జూన్ 30 నుంచి జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

