Thursday, January 22, 2026
Homeకెరీర్IMD Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు రూ. లక్షకి పైగా జీతంతో IMDలో జాబ్‌...

IMD Jobs: ఈ అర్హతలు ఉంటే చాలు రూ. లక్షకి పైగా జీతంతో IMDలో జాబ్‌ కొట్టేయొచ్చు

IMD Jobs Notification: న్యూఢిల్లీలోని భారత వాతావరణ విభాగం(IMD) 134 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మిషన్‌ మోసమ్‌ పథకం కింద వివిధ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌(E, III, II, I), సెంటిఫిక్‌ అసిస్టెంట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రకియ నవంబర్‌ 24న ప్రారంభమైంది. డిసెంబర్‌ 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చని IMD ప్రకటన విడుదల చేసింది. మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/lifestyle/vitamin-d-deficiency-how-long-you-need-to-stay-in-the-sun-to-get-vitamin-d/

వివిధ పోస్టుల ఆధారంగా జీతం రూ. 29,200 నుంచి రూ. 1,23,000 వరకు ఉంది. ఎంపికైన పోస్టు బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఇక విద్యార్హత.. పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో MSC, BE/B TECH ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పీహెచ్‌డీ/ఎంటెక్‌/ఎంఈ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 

పోస్టుల వివరాలు- ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- E- 01, – వయోపరిమితి 50 సంవత్సరాలు

ప్రాజెక్ట్ సైంటిస్ట్‌- III- 13, – వయోపరిమితి – 45 ఏళ్లు

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- II- 29- వయోపరిమితి- 40 ఏళ్లు

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- I- 64- వయో పరిమితి- 35 ఏళ్లు

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- 25- వయోపరిమితి 30 ఏళ్లు

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 02- వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదు. ఈ ఖాళీ పోస్టులను భారత వాతావరణ విభాగం భర్తీ చేయనుంది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/mahesh-kumar-goud-comments-on-panchayat-elections-result/

అప్లికేషన్ల స్క్రీనింగ్‌, విద్యార్హతలు, వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News